![]() |
![]() |

`కేజీఎఫ్` సిరీస్ తో బ్యాక్ టు బ్యాక్ పాన్ - ఇండియా హిట్స్ అందుకున్నారు రాకింగ్ స్టార్ యశ్, స్టార్ కెప్టెన్ ప్రశాంత్ నీల్. కట్ చేస్తే.. త్వరలో ఈ ఇద్దరు మరోమారు జట్టుకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `సలార్` పేరుతో ప్రశాంత్ నీల్ ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్` నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కి.. `కేజీఎఫ్` మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ కొనసాగుతున్నారు. చెన్నై పొన్ను శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో వెర్సటైల్ స్టార్ జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో కనిపించనుండగా.. మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో ఎంటర్టైన్ చేయనున్నారు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `సలార్`లో రాకింగ్ స్టార్ యశ్ ఓ స్పెషల్ రోల్ లో దర్శనమిస్తాడట. సినిమా సెకండాఫ్ లో కొద్ది సెకండ్ల పాటు మెరిసే పాత్ర ఇదని టాక్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే. కాగా, 2023 ద్వితీయార్ధంలో `సలార్` జనం ముందుకు రానుందని సమాచారం.
![]() |
![]() |