![]() |
![]() |

గత ఏడాది సంక్రాంతికి రిలీజైన `మాస్టర్`తో సంచలన విజయం అందుకున్న కోలీవుడ్ స్టార్ విజయ్.. తాజా చిత్రం `బీస్ట్`తో నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో.. రాబోయే సినిమాపైనే అతని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.
`దళపతి 66` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. తెలుగు - తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా రష్మికా మందన్న నటిస్తుండగా.. విజయ్ కి తండ్రిగా వెర్సటైల్ యాక్టర్ శరత్ కుమార్ కనిపించబోతున్నట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `కిక్`, `రేసు గుర్రం` ఫేమ్ శ్యామ్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో దర్వనమివ్వనున్నాడట. అంతేకాదు.. విజయ్ కి అన్నగా అతని పాత్ర ఉంటుందని టాక్. త్వరలోనే `దళపతి 66`లో `కిక్` శ్యామ్ పాత్రపై క్లారిటీ రానుంది. మరి.. ఈ సినిమాతో శ్యామ్ ఎలాంటి గుర్తింపుని పొందుతాడో చూడాలి.
ఇదిలా ఉంటే, ఈ ఏడాది దీపావళికి గానీ లేదంటే 2023 సంక్రాంతికి గానీ ఈ భారీ బడ్జెట్ మూవీ జనం ముందుకు వచ్చే అవకాశముంది.
![]() |
![]() |