![]() |
![]() |

వైవిద్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలిచిన కథానాయికల్లో `సూపర్` స్టార్ అనుష్క ఒకరు. త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ మరో ఆసక్తికరమైన వేషంలో దర్శనమివ్వనుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. `జాతిరత్నాలు` స్టార్ నవీన్ పోలిశెట్టితో కలిసి అనుష్క ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `మిర్చి`, `భాగమతి` వంటి ఘనవిజయాల తరువాత యూవీ క్రియేషన్స్ సంస్థలో అనుష్క నటించబోయే ఈ చిత్రానికి `రా రా కృష్ణయ్య` ఫేమ్ పి. మహేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో స్వీటీ మునుపెన్నడూ చేయని ఓ డిఫరెంట్ రోల్ చేయబోతోందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాలో అంతర్జాతీయ చెఫ్ గా అనుష్క కనిపించబోతోందట. అదే గనుక నిజమైతే.. అనుష్క అభిమానులకు ఇది ఆనందాన్నిచ్చే అంశమే. మరి.. ఈ సరికొత్త పాత్రలో అనుష్క ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి. బహుశా, ఈ ఏడాది చివరలో నవీన్ పోలిశెట్టి - అనుష్కా శెట్టి కాంబో మూవీ తెరపైకి వచ్చే అవకాశముంది.
కాగా, అనుష్క చివరసారిగా `నిశ్శబ్దం` (2020) చిత్రంలో కనిపించింది. ఇందులో మూగ - చెవిటి యువతి పాత్రలో అభినయించింది.
![]() |
![]() |