![]() |
![]() |

ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటీమణుల్లో వెర్సటైల్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ఒకరు. మరీముఖ్యంగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్ లో నటించిన `పడయప్పా` (తెలుగులో `నరసింహా`) చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన ప్రతినాయిక పాత్ర నీలాంబరి ఆమెకి నటిగా ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది.
కట్ చేస్తే.. త్వరలో అదే తరహా పాత్రలో మరోసారి మెరవనుందట రమ్యకృష్ణ. ఆ వివరాల్లోకి వెళితే.. రజినీకాంత్ కథానాయకుడిగా `డాక్టర్`, `బీస్ట్` చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో రజినీకి జోడీగా ఐశ్వర్యా రాయ్ నటించనుందని సమాచారం. అలాగే యంగ్ హీరో శివ కార్తికేయన్, `గ్యాంగ్ లీడర్` భామ ప్రియాంక అరుళ్ మోహన్ యువ జంటగా కనిపించబోతున్నట్లు టాక్. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రమ్యకృష్ణ దర్శనమివ్వబోతోందట. అదే గనుక నిజమైతే.. `బాబా` (2002) తరువాత రజినీకాంత్ చిత్రంలో రమ్యకృష్ణ కనిపించడం ఇదే అవుతుంది. మరి.. `పడయప్పా`కి ప్లస్సయిన రమ్యకృష్ణ విలనిజం.. `తలైవర్ 169`కి కూడా కలిసొస్తుందేమో చూడాలి.
![]() |
![]() |