![]() |
![]() |

`ఉగ్రమ్`, `కేజీఎఫ్ః ఛాప్టర్ 1`, `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` చిత్రాలతో హ్యాట్రిక్ దర్శకుడు అనిపించుకున్నాడు ప్రశాంత్ నీల్. ఈ నేపథ్యంలో.. అతని తదుపరి చిత్రంపైనే అందరి దృష్టి ఉంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో `సలార్` పేరుతో ఈ ప్రాజెక్ట్ ని చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. తన గత చిత్రాల్లాగే ఈ మూవీని కూడా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గానే తెరకెక్కిస్తున్నాడు నీల్. ఇప్పటికే కొంతమేర చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, జూన్ 4 ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని `సలార్` నుంచి సర్ ప్రైజ్ రాబోతోందట. ఆ రోజు.. `సలార్` రిలీజ్ డేట్ గానీ లేదంటే `సలార్` గ్లిమ్స్ గానీ వచ్చే అవకాశముందంటున్నారు. అదే గనుక నిజమైతే.. ప్రభాస్, ప్రశాంత్ అభిమానులకు ఇది ఆనందాన్నిచ్చే అంశమనే చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది.
కాగా, `సలార్`లో ప్రభాస్ కి జోడీగా చెన్నై పొన్ను శ్రుతి హాసన్ నటిస్తుండగా.. వెర్సటైల్ స్టార్ జగపతి బాబు, మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. హోంబళే ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీకి రవి బస్రూర్ సంగీతమందిస్తుండగా.. భువన్ గౌడ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
![]() |
![]() |