![]() |
![]() |

విక్టరీ వెంకటేశ్, వెర్సటైల్ స్టార్ జగపతి బాబు.. ఓ హిందీ సినిమా కోసం జట్టుకట్టనున్నారా? అవునన్నదే లేటెస్ట్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా పర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఓ హిందీ సినిమా రాబోతోంది. `కబీ ఈద్ కబీ దీవాళి`, `భాయ్ జాన్` వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్న ఈ ఫ్యామిలీ డ్రామాలో సల్మాన్ కి జోడీగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే ఎంటర్టైన్ చేయనుంది. మే 11 నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో వెంకటేశ్ ఓ స్పెషల్ రోల్ లో నటించబోతున్నట్లు కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇందులో ప్రతినాయకుడిగా జగపతి బాబు కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే, వెంకీ - జగ్గూ భాయ్ మధ్య కూడా కొన్ని సన్నివేశాలు ఉంటాయని వినిపిస్తోంది. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, ఇప్పటికే `అనారి` (1993), `తఖ్ దీర్ వాలా` (1995) వంటి హిందీ చిత్రాల్లో వెంకీ కథానాయకుడిగా నటించగా.. జగపతి బాబుకి మాత్రం ఇదే మొదటి బాలీవుడ్ మూవీ కానుంది. తెలుగులోనూ ఈ సినిమా అనువాద రూపంలో సందడి చేయనుందని టాక్.
![]() |
![]() |