విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అంతేనా వచ్చే నెలలోనే ఎంగేజ్ మెంట్ అంటూ పలుసార్లు ప్రచారం కూడా జరిగింది. కానీ అవి ప్రచారానికే పరిమితమవుతూ వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి విజయ్-రష్మిక పెళ్ళి టాపిక్ తెరమీదకు వచ్చింది.
డిసెంబర్ లో విజయ్-రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకోబుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది పెళ్లి జరిగే అవకాశముంది అంటున్నారు. త్వరలోనే అభిమానులతో ఈ విషయాన్ని విజయ్-రష్మిక పంచుకోనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది.