మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ట 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత మరో యువ దర్శకుడితో సినిమా చేయడానికి చిరంజీవి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. శ్రీకాంత్ ఓదెల.
నాని హీరోగా నటించిన 'దసరా'తో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల, మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని అందుకొని మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ గా రెండో మూవీ 'పారడైస్'ను నానితోనే చేస్తున్నాడు. దీని తర్వాత ఏకంగా చిరంజీవితో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, శ్రీకాంత్ చెప్పిన స్టోరీ మెగాస్టార్ కి నచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముంది అంటున్నారు.