![]() |
![]() |

రీసెంట్ గా పాన్ - ఇండియా బ్లాక్ బస్టర్ `కేజీఎఫ్ః ఛాప్టర్ 2`లో రమికా సేన్ పాత్రలో ఆకట్టుకుంది సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్. కాగా, త్వరలో ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ టాలీవుడ్ కి చెందిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ లోనూ భాగం కానుందట.
ఆ వివరాల్లోకి వెళితే.. `గబ్బర్ సింగ్` (2012) వంటి సంచలన చిత్రం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టార్ కెప్టెన్ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `భవదీయుడు భగత్ సింగ్` అనే పేరుతో తెరకెక్కనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో పవన్ కి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో ఓ ముఖ్య పాత్ర కోసం రవీనా టాండన్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కథ, పాత్ర, పారితోషికం నచ్చడంతో రవీనా కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. త్వరలోనే `భవదీయుడు భగత్ సింగ్`లో రవీనా టాండన్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే, గతంలో `రథసారధి` (1993), `బంగారు బుల్లోడు` (1993), `ఆకాశ వీధిలో` (2001), `పాండవులు పాండవులు తుమ్మెద` (2014) వంటి తెలుగు చిత్రాల్లో సందడి చేసింది రవీనా టాండన్.
![]() |
![]() |