![]() |
![]() |

`అఖండ`తో సంచలన విజయం అందుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన మరో మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ భారీ బడ్జెట్ మూవీ ఇదే ఏడాది థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే, `ఎన్బీకే 107` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని బాలకృష్ణ బర్త్ డే స్పెషల్ గా జూన్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాదు.. బాలయ్య అభిమానులను మైమరిపించేలా టీజర్ లోని విజువల్స్ ఉంటాయని టాక్. త్వరలోనే `ఎన్బీకే 107` టీజర్ కి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. బాలయ్య - గోపీచంద్ మలినేని ఫస్ట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ ముంగిట ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
కాగా, `ఎన్బీకే 107`లో బాలకృష్ణకి జోడీగా చెన్నై పొన్ను శ్రుతి హాసన్ నటిస్తుండగా వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు.
![]() |
![]() |