![]() |
![]() |

పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజైన `పుష్ప - ద రైజ్` (2021) ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీముఖ్యంగా.. హిందీనాట అంచనాలకు మించి ఆదరణ పొందిందీ యాక్షన్ థ్రిల్లర్. అంతేకాదు.. ఈ చిత్రంతో అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఇటు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రేంజ్ కూడా మరింతగా పెరిగింది. కాగా, త్వరలో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్.. `పుష్ప - ద రూల్` సెట్స్ పైకి వెళ్ళనుంది.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `పుష్ప - ద రూల్`లో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు కీలక పాత్రలో ఎంటర్టైన్ చేయనున్నాడట. ఆ నటుడు మరెవరో కాదు.. వెర్సటైల్ స్టార్ సునీల్ శెట్టి. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ప్రతినాయకుడు పాత్రధారి అయిన ఫహద్ ఫాజిల్ కి పై అధికారిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా సునీల్ శెట్టి దర్శనమివ్వబోతున్నట్లు తెలిసింది. పాత్ర నిడివి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. త్వరలోనే `పుష్ప - ద రూల్`లో సునీల్ శెట్టి ఎంట్రీపై క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే, 1992లో విడుదలైన హిందీ చిత్రం `బలవాన్`తో కథానాయకుడిగా పరిచయమైన సునీల్ శెట్టి.. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ ముఖ్య పాత్రల్లో అలరించాడు. తెలుగులో ఇదివరకు `మోసగాళ్ళు` (2021), `గని` (2022) చిత్రాల్లో కనిపించాడు సునీల్ శెట్టి.
![]() |
![]() |