![]() |
![]() |

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ తన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో ఒకే తరహా పాత్రలో దర్శనమివ్వబోతున్నాడా? అవునన్నదే ఫిల్మ్ నగర్ బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. స్వల్ప విరామం అనంతరం విజయ్ దేవరకొండ `లైగర్` చిత్రంతో మళ్ళీ వెండితెరపై సందడి చేయనున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ పాన్ - ఇండియా మూవీ.. ఆగస్టు 25న జనం ముందుకు రాబోతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ఇప్పటివరకు తను పోషించని బాక్సర్ పాత్రలో మెస్మరైజ్ చేయనున్నాడు విజయ్ దేవరకొండ.
ఇదిలా ఉంటే, `లైగర్` తరువాత పూరి దర్శకత్వంలోనే `జనగణమన` పేరుతో మరో సినిమా చేయబోతున్నాడీ రౌడీ హీరో. అలాగే `నిన్ను కోరి`, `మజిలీ` చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లోనూ ఓ మూవీ చేయబోతున్నాడు. కాగా, ఈ రెండు చిత్రాల్లోనూ విజయ్ ఆర్మీ ఆఫీసర్ గానే కనిపించబోతున్నాడని సమాచారం. అంటే.. వెంటవెంటనే ఒకే తరహా వేషంలో అలరించే ప్రయత్నం చేయబోతున్నాడన్నమాట. మరి.. ఈ రెండు సినిమాల్లోనూ విజయ్ దేవరకొండ.. జవాన్ గా ఎలాంటి వేరియేషన్స్ ప్రదర్శిస్తాడో చూడాలి.
![]() |
![]() |