![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బాబీ డైరెక్టోరియల్ ఒకటి. `మెగా 154` అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా చెన్నై పొన్ను శ్రుతి హాసన్ నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ ప్రత్యేక పాత్రలో నటించబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ చిత్రం తాలుకూ ద్వితీయార్ధంలో రవితేజ పాత్ర ఎంట్రీ ఇస్తుందట. ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే ఈ క్యారెక్టర్.. సినిమా హైలైట్స్ లో ఒకటని టాక్. అంతేకాదు.. గత కొంతకాలంగా వినిపిస్తున్నట్లుగా చిరుకి తమ్ముడిగానే రవితేజ రోల్ ఉంటుందని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, ప్రస్తుతం రవితేజ చేతిలో `రామారావు ఆన్ డ్యూటీ`, `ధమాకా`, `రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలున్నాయి. వీటిలో `రామారావు ఆన్ డ్యూటీ` జూన్ 17న రిలీజ్ కానుంది.
![]() |
![]() |