![]() |
![]() |

గత ఏడాది విడుదలైన `డాక్టర్` (తెలుగులో `వరుణ్ డాక్టర్`) చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు తమిళ యువ కథానాయకుడు శివ కార్తికేయన్. త్వరలో ఈ యంగ్ హీరో `డాన్`గా పలకరించబోతున్నాడు. అలాగే, ప్రస్తుతం తెలుగు - తమిళ భాషల్లోనూ ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే, తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో ఓ ముఖ్య పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శివ కార్తికేయన్. ఆ వివరాల్లోకి వెళితే.. `డాక్టర్` ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `తలైవర్ 169` అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానుసారం మరో హీరోకి కూడా స్థానముందట. ఆ పాత్రలో శివ కార్తికేయన్ నటించబోతున్నాడని కోలీవుడ్ బజ్. అదే గనుక నిజమైతే.. శివ కార్తికేయన్ కి ఇది గోల్డెన్ ఆఫర్ అనే చెప్పాలి. త్వరలోనే `తలైవర్ 169`లో శివకార్తికేయన్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. సూపర్ స్టార్ తో `డాక్టర్` స్టార్ జట్టుకట్టనున్న ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
కాగా, `తలైవర్ 169`లో రజినీకాంత్ కి జంటగా ఐశ్వర్య రాయ్ నటించబోతోందని సమాచారం. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతమందించనున్నాడు.
![]() |
![]() |