![]() |
![]() |

`ఖైదీ నంబర్ 150`, `సైరా.. నరసింహారెడ్డి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మెగాస్టార్ చిరంజీవి నుంచి.. `ఆర్ ఆర్ ఆర్` వంటి సెన్సేషనల్ మూవీ అనంతరం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి రాబోతున్న సినిమా `ఆచార్య`. ఇందులో చిరు టైటిల్ రోల్ లో ఎంటర్టైన్ చేయనుండగా.. సిద్ధగా మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చరణ్ దర్శనమివ్వనున్నారు. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ సోషల్ డ్రామా.. వేసవి కానుకగా ఈ నెల 29న జనం ముందుకు రాబోతోంది.
ఇదిలా ఉంటే, `ఆచార్య` రన్ టైమ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 166 నిమిషాలు (2 గంటల 46 నిమిషాలు) నిడివితో ఈ సినిమా వినోదాలు పంచనుందట. మరి... `ఆచార్య` డ్యూరేషన్ పై జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, `ఆచార్య`లో చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించనుండగా.. రామ్ చరణ్ కి జంటగా పూజా హెగ్డే అలరించనుంది. సోనూసూద్, ప్రకాశ్ రాజ్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రెజీనా ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేయనుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందించారు.
![]() |
![]() |