![]() |
![]() |

బాక్సాఫీస్ కి పూనకాలు తెప్పించే కాంబినేషన్స్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ - మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబో ఒకటి. `సింహా` (2010), `లెజెండ్` (2014), `అఖండ` (2021).. ఇలా ముచ్చటగా మూడుసార్లు జట్టుకొట్టి `హ్యాట్రిక్` బ్లాక్ బస్టర్స్ అందుకున్న వైనం బాలయ్య - బోయపాటి కాంబినేషన్ సొంతం. అలాంటి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ లో.. అతి త్వరలో మరో సినిమా రాబోతోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా బాలయ్యకి ఓ స్టోరీలైన్ వినిపించారట బోయపాటి. అది నచ్చడంతో బాలకృష్ణ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బజ్. పొలిటికల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తారని సమాచారం. అంతేకాదు.. 2023 ద్వితీయార్ధంలో పట్టాలెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. 2024 ఎన్నికలకి ముందు రిలీజ్ చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందట. త్వరలోనే బాలయ్య - బోయపాటి కొత్త చిత్రంపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. ఈ పొలిటికల్ డ్రామాతో ఈ సెన్సేషనల్ కాంబో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
కాగా, బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే, సెప్టెంబర్ నుండి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఇక బోయపాటి విషయానికి వస్తే ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఓ పాన్ - ఇండియా సినిమాని తీయబోతున్నారు. 2023 ద్వితీయార్ధంలోపే ఈ కమిట్మెంట్స్ అన్నీ పూర్తి కానున్నాయి.
i
![]() |
![]() |