బిజెపి అధ్యక్షుడి బయోపిక్ లో హీరో విశాల్
on May 4, 2024
బయోపిక్ లు సిల్వర్ స్క్రీన్ కి కొత్హేమీ కాదు.. దశాబ్దాల నుంచే ఎంతో మంది గొప్ప వాళ్ళ బయోపిక్ లు సిల్వర్ స్క్రీన్ మీద మెరిసాయి.మూవీ పర్సన్స్ , స్పోర్ట్స్ మేన్స్ ,పొలిటీషియన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసిన వాళ్ళందరి బయోపిక్ లు వచ్చాయి. తాజాగా వీటి సరసన ఇంకోటి చేరబోతోంది. కాకపోతే ఇది కొంచం స్పెషల్
భారతీయ జనతా పార్టీ ఉరఫ్ బిజెపికి అన్ని రాష్ట్రాల్లోను అధ్యక్షులు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు అన్నామలై. ఈయన తమిళనాడు రాష్టానికి అధక్షుడు గా ఉన్నాడు. ప్రాంతీయ తత్వాన్ని అణువణువునా నింపుకున్న తమిళనాడు లో బీజేపీ ఎదగడానికి అన్నామలై ఎంతగానో కృషి చేస్తున్నారు. అందులో భాగంగా పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేస్తు వస్తున్నారు.దీంతో చాలా మంది సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు. అదంతా ఆయన కృషి ఫలితమే. అంతటి విశిష్టత కల్గిన అన్నామలై జీవిత కథ ఆధారంగా తమిళనాట సినిమా తెరకెక్కనుంది. స్టార్ హీరో విశాల్ అన్నామలై క్యారక్టర్ ని పోషించబోతున్నారు. ఈ మేరకు విశాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. కాకపోతే బయోపిక్ గురించి అధికారకంగా ఎలాంటి ప్రకటన రాలేదు
కాగా విశాల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో 2026 లో జరిగే ఎన్నికల లిస్ట్ లో తన పేరు ఉంటుందని చెప్పాడు. పైగా బిజెపి అధ్యక్షుడు అన్నామలై వాగ్ధాటి, పార్టీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయంటు కూడా చెప్పాడు.ఈ నేపథ్యంలో బయోపిక్ ఖాయమనే మాటలు వినపడుతున్నాయి. అన్నామలై గతంలో పోలీసు శాఖలో ఉన్నత అధికారిగా పని చేసాడు. ఒక పోలీసు అధికారి పొలిటీషియన్ గా ఎలా మారాడు అనే పాయింట్ తోనే మూవీ తెరకెక్కబోతుంది
Also Read