టిల్లు స్క్వేర్ ఓటిటి పార్టనర్ కన్ఫార్మ్
on Mar 28, 2024
తమ అభిమాన హీరో సినిమా కోసం ఆ హీరో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అందరి హీరోల అభిమానులు కలిసి ఒక హీరో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఆ హీరో సిద్దు (Siddu Jonnalagadda) జొన్నలగడ్డ. ఆ మూవీ టిల్లు స్క్వేర్( Tillu square)మార్చి 29 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న టిల్లు స్క్వేర్ గురించి వస్తున్న తాజా న్యూస్ ఒకటి సినీ ప్రియులని ఆనందంలో ముంచెత్తుతుంది.
టిల్లు స్క్వేర్ స్ట్రీమింగ్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.అంటే టిల్లు స్క్వేర్ ఓటిటి వేదికగా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. ఈ మేరకు అధికారకంగా కూడా కన్ఫార్మ్ అయ్యింది. భారీ ధరను చెల్లించి సదరు సంస్థ దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి. మరి ఓటిటి లో ఎప్పుడు ప్రత్యక్షమవ్వాలనేది సినిమా విజయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
2022 లో వచ్చిన డిజె టిల్లు కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొందింది. మొదటి పార్ట్ లో సిద్దు చేసిన అల్లరి ని ఎవరు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో అంతకు మించి చేయబోతున్నాడని తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ కలిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సిద్ధూ సరసన అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran) చేస్తుంది. మల్లిక్ రామ్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు. రామ్ మిర్యాల, భీమ్స్ లు సంగీతాన్ని అందించారు. మురళీ శర్మ, ప్రిన్స్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.
Also Read