అమెరికాలో ‘తారకరామం’ పుస్తకావిష్కరణ
on Dec 16, 2024
తెలుగు ప్రజల హృదయాల నేలిన విశ్వవిఖ్యాత నటచక్రవర్తి, నిత్య నీరాజనాలందుకుంటున్న తెలుగుజాతి ఆత్మగౌరవ నినాద ప్రదాత ‘అన్న’ నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవం సందర్భంగా అమెరికాలో ‘తారకరామం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు.
కనెక్టికట్‌లో ఎన్.టి.ఆర్. లిటరేచర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ వైస్ చైర్మన్ అశ్విన్ అట్లూరి సారధ్యంలో ఎన్.టి.ఆర్. అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సీనియర్ జర్నలిస్ట్ మరియు రచయిత భగీరథ సంపాదకత్వంలో రూపొందిన ‘తారకరామం’ ప్రత్యేక సంచిక విడుదలైంది. ఈ గ్రంథాన్ని ఎన్.టి.ఆర్. లిటరేచర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, సినీ ప్రముఖుల సమక్షంలో విజయవాడలో విడుదలైంది.
ఇదే సందర్భంలో అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రంలో మా మహానాడు న్యూ ఇంగ్లాండ్ టీంతో కలిసి ఈ గ్రంథాన్ని విడుదల చెయ్యటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అట్లూరి అశ్విన్ తెలిపారు. ఎన్.టి.ఆర్. నట ప్రస్థానం ‘మన దేశం’తో మొదలై ‘మేజర్ చంద్రకాంత్’ వరకు కొనసాగిందని, ఈమధ్యకాలంలో తెలుగు సినీరంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన 75 ఏళ్ల చరిత్రకు ‘తారకరామం’ వేదికైందని ఆయన తెలిపారు. అన్న ఎన్.టి.ఆర్. సినిమా వజ్రోత్సవాన్ని అమెరికాలో జరుపుకోడం ఎంతో ఆనందం కలిగిస్తుందని అశ్విన్ తెలిపారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)