శ్రీలీల మకాం ఇక విజయవాడ నేనా! తెలుగుదేశం నాయకుల కోలాహలం
on Sep 28, 2024
మాస్ మహారాజా రవితేజ(ravi teja)హీరోగా వచ్చిన ధమాకా తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీలీల(sreeleela)అక్కడ్నుంచి అగ్ర హీరోలందరితో జత కట్టి బిజీ ఆర్టిస్ట్ గా కూడా మారింది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్(pawan kalyan)తో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు నితిన్ రాబిన్ హుడ్ మూవీలోను చేస్తుంది.
శ్రీలీల రీసెంట్ గా విజయవాడలో ప్రత్యక్షమయ్యింది. వస్త్ర రంగంలో విశేష ఖ్యాతిని గడించిన చెన్నై సిల్క్స్ తమ నూతన బ్రాంచ్ ని శ్రీలీల చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ సందర్భంగా శ్రీలీలని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేసారు.ఎంజి రోడ్ లో ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన తెలుగుదేశంఎంపీ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యే లు కూడా పాల్గొన్నారు.
ఇక పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన హరిహర వీరమల్లు షూటింగ్ విజయవాడ లోనే జరుగుతున్న విషయం అందరకి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ కూడా విజయవాడలోనే జరగబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే శ్రీలీల విజయవాడలోనే కొన్ని రోజుల మకాం ఉండే అవకాశం ఉండవచ్చు.
Also Read