పవన్ కొడుకు మార్క్ శంకర్ ని కాపాడిన భారతీయ కార్మికులకి ప్రభుత్వ సన్మానం..డబ్బులెంత ఇచ్చారు!
on Apr 12, 2025

పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిన్నకుమారుడు మార్క్ శంకర్(Mark Shankar)ఏప్రిల్ 8న సింగపూర్ లో తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలైన విషయం తెలిసిందే.అనంతరం హాస్పిటల్ లో జాయిన్ అయిన మార్క్ రీసెంట్ గా డిశ్చార్జ్ అయ్యాడు.ఈ విషయాన్నీ చిరంజీవి అధికారంగా ప్రకటించడంతో పాటు తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలిపాడు.
అగ్ని ప్రమాదం జరిగిన మూడంతస్థుల స్కూల్ బిల్డింగ్ లో మార్క్ శంకర్ తో పాటు 14 మంది పిల్లలు,మరో 5 గురు పెద్ద వాళ్ళు చిక్కుకోవడం జరిగింది.అదే సమయంలో మన దేశానికి సంబంధించిన కొంత మంది వలస కార్మికులు,సమీపంలో ఉన్న భవంతి లో పని చేస్తున్నారు. వాళ్లంతా స్కూల్ భవంతి నుంచి అరుపులు రావడంతో పాటుపెద్ద ఎత్తున పొగలు రావడం గమనించారు.వెంటనే వారంతా ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా తమ ప్రాణాలని సైతం పణంగా పెట్టి స్కూల్ లోపలికి వెళ్లి పిల్లల్ని సురక్షితంగా కిందకి తీసుకొచ్చారు.ఇదే విషయాన్నీ సింగపూర్(Singapore)ప్రభుత్వం అధికారకంగా ప్రకటించి మన దేశానికీ సంబంధించిన కార్మికుల్నిసత్కరించడం జరిగింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



