డ్రగ్స్ రైడ్ చేస్తుంటే మూడో అంతస్థు నుంచి దూకి పారిపోయిన అగ్ర నటుడు!
on Apr 17, 2025

ప్రముఖ మలయాళ నటుడు 'షైన్ టామ్ చాకో' గురించి తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. నాచురల్ స్టార్ నాని హీరోగా 2023 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'దసరా' మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యి, రంగబలి, రాబిన్ హుడ్, బాలయ్య వన్ మాన్ షో 'డాకుమహారాజ్' సినిమాల ద్వారా మరింతగా దగ్గరయ్యాడు.
రీసెంట్ గా కొచ్చిలోని ఒక హోటల్ లో షైన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడన్న సమాచారం రావడంతో నార్కెటిక్ బృందం సదరు హోటల్ కి వెళ్ళింది. కానీ వాళ్ళు హోటల్ కి చేరుకోవడాని కంటే ముందే మూడో అంతస్థులో ఉన్న షైన్ కిటికీ లో నుంచి రెండో అంతస్తులోకి దూకి పారిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. 2002 లో సినీరంగ ప్రవేశం చేసిన షైన్ ఇప్పటి వరకు మళయాళంతో పాటు ఇతర భాషల్లో కలిపి సుమారు 100 కి పైగానే సినిమాలు చేసాడు.
మరో వైపు 'షైన్' సినిమా సెట్స్ లో డ్రగ్స్ సేవించి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, ప్రముఖ మలయాళ నటి 'విన్సీ అలోషియస్'(Vincy aloshious)కేరళ ఫిలిం చాంబర్ తో పాటు అమ్మ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



