అదరగొడుతున్న శంబాల.. నాలుగు రోజుల కలెక్షన్స్ ఇవే
on Dec 29, 2025

-శంబాల రికార్డు కలెక్షన్స్
-ఎంత వసూలు చేసింది
-పూర్తి డీటెయిల్స్ ఇవే
ఆది సాయికుమార్ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హిట్ 'శంబాల'తో దక్కించుకున్నాడు. ఎలాంటి హిట్ అంటే ఇంకొన్నేళ్ల పాటు ప్రేక్షకులని తన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించడానికి ఎలాంటి డోకా లేదనే చెప్పే సంజీవిని అని కూడా చెప్పుకోవచ్చు. . పరమేశ్వరుడు, అంధకాసురుడు అనే రాక్షసుడు మధ్య జరిగిన యుద్దానికి, శంబాల గ్రామంలోని కొంత మంది మనుషుల ఈర్ష్య, స్వార్ధ బుద్ధికి సంబంధం ఏంటనే పాయింట్ కి అన్ని వర్గాల ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతున్నారు. దీంతో శంబాల రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది.మరి ఇప్పటి వరకు ఎంత మేర కలెక్షన్స్ ని సాధించిందో చూద్దాం.
డిసెంబర్ 25 న విడుదలైన ఈ మూవీ నిన్న నాలుగు రోజులు వరకు 8 . 2 కోట్లరూపాయల గ్రాస్ కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాకి పోటీగా ఈషా, దండోరా, ఛాంపియన్, పతంగ్ వంటి చిత్రాలు థియేటర్స్ లో ఉన్నాయి. పైగా ధురంధర్ కూడా తన సత్తా చాటుతు ఇంకా స్టడీగా ఉంది. ఇలాంటి స్టేజ్ లో శంబాల ఆ స్థాయి కలెక్షన్స్ సాధించిందంటే శంబాల ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చనే మాటలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మిగతా చిత్రాల కంటే శంబాల కి కొంచం ఎక్కువగానే పాజిటివ్ టాక్ వస్తుండటంతో పూర్తి రన్నింగ్ లో ఆది సాయికుమార్ ఈ సారి రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకోవడం పక్కా అనే అభిప్రాయాన్ని కూడా ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
Also read: వారణాసి కంటే ముందే మరో మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తున్న రాజమౌళి
ఓవర్ సీస్ లో కూడా ఈ మూవీ తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతూ ఉంది. ఇప్పటి వరకు 90 కే డాలర్స్ వసూలు చేసినట్టుగా సోషల్ మీడియాలో న్యూస్ ఒకటి హల్ చల్ చేస్తుంది. సుమారు పది కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన శంబాల కి రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి యొక్క నిర్మాణ విలువలు, యుగంధర్ ముని దర్శకత్వ ప్రతిభ, శ్రీ చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నటీనటుల పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో కుదిరాయి. మైథలాజిల్, యాక్షన్, హర్రర్ , థ్రిల్లర్ గా తెరకెక్కింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



