సాయిదుర్గాతేజ్ కి అవార్డుని ప్రకటించిన బడా సంస్థ
on Dec 2, 2024
సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్(saidurga tej)స్వాతి రెడ్డి(swathi reddy)హీరో హీరోయిన్లుగా 'సోల్ ఆఫ్ సత్య'(sole of satya)అనే ఒక షార్ట్ ఫిలిం గత సంవత్సరం సోషల్ మీడియా వేదికగా రిలీజైన విషయం తెలిసిందే.దిల్ రాజు సమర్పణలో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాతలుగా వ్యవరించగా సీనియర్ నటుడు నరేష్ కొడుకు విజయ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది.
ఇప్పుడు ఈ మూవీ 2024 కి సంబంధించి ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ లో పీపుల్స్ ఛాయిస్ అవార్డు ని గెలుచుకుంది.ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా తెలియచేసిన తేజ్ 'సత్య ప్రజల కోసం రూపొందించబడిన ఒక అందమైన కథ.2024 కి సంబంధించి ఫిలింఫేర్ పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ షార్ట్ ఫిలిం గా ప్రజలచే రివార్డ్ చెయ్యబడింది.నలుగురు స్నేహితులం కలిసి మొదలు పెట్టిన ఈ ప్రయాణం జీవితాంతం నిలిచిపోయే జ్ఞాపకాలని అందించింది. అందరకి దన్యవాదాలు అంటూ ట్వీట్ చేసాడు.
దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడు ఎంత గొప్పవాడో,ఆ సైనికుడు భార్య కూడా అంతే గొప్పదని చెప్పిన ఈ షార్ట్ ఫిలిం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల కావడం జరిగింది.
Also Read