ఏం పాట ఇది..మీకు అసలు అర్ధమవుతుందా
on Dec 19, 2024
విక్టరీ వెంకటేష్(venkatesh)ఐశ్వర్య రాజేష్(aiswarya rajesh)మీనాక్షి చౌదరి(meenakshi chowdhary)కాంబోలో అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'(sankranthiki vasthunnam)టైటిల్ కి తగ్గట్టే సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది.హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు(dil raju)నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై వెంకటేష్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మొదటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
రీసెంట్ గా ఈ మూవీ నుంచి 'మీను' అనే ఒక సూపర్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది.ప్రోమోగా రిలీజ్ అయిన ఆ సాంగ్ లోని పదాలన్ని చాలా క్యాచీగా ఉండి ప్రతి ఒక్కరు పాడుకునేలా ఉన్నాయి.భార్యకి,తన ఫస్ట్ లవ్ గురించి చెప్పడం,లవర్ కూడా వాళ్ళ పక్కనే ఉన్న ఉంటూ సాగిన సాంగ్ ప్రోమో సినిమాపై అందరిలో అంచనాలు పెంచిందని చెప్పాలి.
రాజేంద్ర ప్రసాద్,ఉపేంద్ర లిమయే,నరేష్,విటివి గణేష్,ప్రధాన పాత్రలు పోషిస్తుండగా బీమ్స్ సిసోరియా సంగీతాన్ని అందించాడు. అనిల్ రావిపూడి,వెంకటేష్ కాంబోలో ఇంతకుముందు ఎఫ్ 2 ,ఎఫ్ 3 వచ్చి ఘన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' హ్యాట్రిక్ సాధించడం ఖాయమనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది.
Also Read