విజయ్ తో కలిసి రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్న సమంత
on Jul 2, 2024
ఎక్స్ పైరీ డేట్ లేని హీరోయిన్లు అప్పుడప్పుడు తళుక్కుమంటూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు సమంత(samantha)2010 లో వచ్చిన ఏ మాయచేసావే దగ్గర్నుంచి నేటికీ తన హవాని కొనసాగిస్తు ఉంది. ఆరోగ్య కారణాల దృష్ట్యా విజయ్ దేవరకొండ తో కలిసి చేసిన ఖుషి తర్వాత కొత్త సినిమాలేమి ఒప్పుకోలేదు. ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకున్న హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ గతంలో ఒప్పుకున్నదే. లేటెస్ట్ గా ఒక కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పడు ఆ మూవీ టాక్ ఆఫ్ ది డే గా నిలిచింది.
ఇళయ తలపతి (ilayathalapathy)విజయ్(vijay)ప్రస్తుతం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అలియాస్ ది గోట్ తో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోతుంది. దీని తర్వాత ఇంకో మూవీకి కూడా రంగం సిద్ధం అయ్యింది. ఇందులో హీరోయిన్ గా సమంత ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా అధికార ప్రకటన లాంటిదే. హెచ్ వినోద్(h vinod)దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గతంలో అజిత్, కార్తీ వంటి సూపర్ స్టార్స్ తో బ్లాక్ బస్టర్ సినిమాలని తెరకెక్కించాడు. పవన్ వకీల్ సాబ్ ని అజిత్ తో తీసి మంచి పేరు కూడా సంపాదించాడు. ఇక ఇప్పుడు విజయ్ ,సమంత ల మూవీ మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీగా తెరకెక్కబోతుంది. ఎందుకంటే విజయ్ పొలిటికల్ పార్టీ స్థాపించిన నేపథ్యంలో ఇదే చివరి చిత్రమనే వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ చివరి హీరోయిన్ గా సమంత రికార్డు నెలకొల్పనుంది. పైగా విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి వరల్డ్ వైడ్ గా సూపర్బ్ క్రేజ్ రానుంది.
ఇక సమంత, విజయ్ లు గతంలో మెర్సిల్ లో కలిసి చేసారు. 2017 లో వచ్చిన ఆ మూవీ మంచి విజయాన్ని సాధించింది అందులో ఇద్దరి స్క్రీన్ ప్రెజన్స్ ఒక రేంజ్ లో ఉంటుంది. మళ్ళీ చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత చేస్తుండంతో ఇద్దరి అభిమానుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి.అలాగే తమిళ సినీ పరిశ్రమలో ఇంకో న్యూస్ కూడా చక్కర్లు కొడుతుంది. విజయ్ 69 వ చిత్రంగా సెట్స్ మీదకి వెళ్లే ఆ మూవీ రాజకీయ నేపధ్యంతో ఉండబోతోందనే వార్తలు వస్తున్నాయి. మరి మూవీలో విజయ్ రాజకీయాలకి సమంత సపోర్ట్ చేస్తుందా లేక భయంతో వద్దంటుందా తెలియాలి. ఎందుకంటే హీరోయిన్ కదా.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)