ప్రభాస్ ఫ్యాన్స్ ఊరమాస్.. సలార్ రీ-రిలీజ్ కి దిమ్మతిరిగే రెస్పాన్స్!
on Mar 13, 2025
ప్రభాస్ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'సలార్' (Salaar). హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా.. 2023 డిసెంబర్ లో విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ చూపించిన తీరుకి, యాక్షన్ సన్నివేశాలకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అసలు కరెక్ట్ టైంలో రిలీజ్ అయితే.. వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టేదనేది ప్రభాస్ అభిమానుల అభిప్రాయం. అందుకే సలార్ పార్ట్-2 కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి పార్ట్-2 ఎప్పుడు మొదలవుతుందో తెలియదు కానీ.. సలార్-1 మాత్రం మరోసారి థియేటర్లలో అలరించనుంది. (Salaar Bookings)
సలార్ మూవీ మార్చి 21న రీ-రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ లో కొంతకాలంగా రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. పది ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన సినిమాలు.. ఇప్పుడు మళ్ళీ థియేటర్లలో అడుగుపెడుతున్నాయి. వింటేజ్ సినిమాలను ఫ్యాన్స్ మళ్ళీ సెలెబ్రేట్ చేస్తుండటంతో.. రీరిలీజ్ సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. కానీ, సలార్ వచ్చి ఏడాది మాత్రమే అయింది. అయినప్పటికీ ఈ మూవీ రీరిలీజ్ కి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. వారం ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. పెట్టిన షోలు పెట్టినట్టుగా వెంటనే ఫుల్ అయిపోతున్నాయి. అంతేకాదు బుక్ మై షోలో ట్రెండింగ్ లో ఉంది. చాలా కొత్త సినిమాల బుకింగ్స్ కంటే కూడా.. సలార్ రీ-రిలీజ్ బుకింగ్స్ కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుండటం విశేషం. అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. రీరిలీజ్ సినిమాల కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు నమోదు కావడం ఖాయమనిపిస్తోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
