రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చెయ్యద్దు
on Dec 2, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(chandrababu naidu)ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan)ఐటి శాఖా మంత్రి లోకేష్(lokesh)పై వ్యక్తిగత దూషణలు,వివాదాస్పద పోస్టులు చేసిందనుకుగాను,నమోదయిన కేసులో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్న విషయం తెలిసిందే.కాకపోతే కొన్ని ఛానల్స్ లో బహిరంగంగానే ఇంటర్వ్యూ లు ఇస్తూ తనని తాను సమర్ధించుకుంటున్నాడు.ఇక ఈ కేసులో అరెస్ట్ భయంతో ఉన్న వర్మ ఏపి హైకోర్టులో కొన్ని రోజుల క్రితం ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. గత రెండు పర్యాయాలు వర్మ బెయిల్ పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకొని కోర్టు తాజాగా తన తీర్పుని వెల్లడించడం జరిగింది.
ముందస్తు బెయిల్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ హైకోర్టు వర్మని సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.దీంతో వర్మ కి కొద్దిగా ఊరట లభించిందని భావించవచ్చు.మరి ముందు ముందు కోర్టు ఎలాంటి తీర్పుని ప్రకటిస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది.
Also Read