వాళ్ళ నిజస్వరూపాలు నాకు తెలుసు.. రాధిక ఆప్టే సంచలన వ్యాఖ్యలు
on Dec 20, 2025

-ఎవరు వాళ్ళు?
-ఏం చెప్పింది
-సంచలనంగా మారిన స్పీచ్
రామ్ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన 'రక్త చరిత్ర' రెండు భాగాల్లో అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో మెప్పించిన భామ రాధిక ఆప్టే. ఈ చిత్రమే ఆమె మొదటి తెలుగు మూవీ. ఆ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ తో లెజండ్, లయన్ వంటి చిత్రాల్లో జత కట్టి మరింత దగ్గరయ్యింది. రీసెంట్ గా ఆమె తన సినీ జర్నీకి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
రాధికా ఆప్టే మాట్లాడుతు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని దక్షిణాది సినిమాల్లో నటించాల్సి వచ్చింది.కానీ సదరు సినిమా సెట్స్‌లో ఎదురైన అనుభవాలు తీవ్రంగా కలచివేసాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో షూటింగ్‌లు జరిగేటప్పుడు సెట్లో నేను మాత్రమే మహిళని. మహిళల శరీరాల గురించి అసభ్యకరమైన జోకులు వేయడం, చెస్ట్ ప్యాడింగ్ వాడాలని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు తనను తీవ్ర అసౌకర్యానికి గురి చేసాయి. నేను సాధారణంగా చాలా ధైర్యంగా ఉంటాను. కానీ ఆ రోజులని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ నా గుండె భయంతో వేగంగా కొట్టుకుంటుంది. బాలీవుడ్‌లోని కొందరు పెద్ద వ్యక్తుల నిజస్వరూపాలు కూడా నాకు తెలుసు. నాకు వచ్చిన సినిమా ఆఫర్ల సందర్భంగా కొందరిని కలిశాను. వారితో మాట్లాడిన తర్వాత ఇక జీవితంలో మళ్లీ వారిని కలవకూడదని నిర్ణయించుకున్నా. వాళ్లు చాలా పేరున్న వ్యక్తులు. వారి పేర్లు చెబితే అందరూ షాకవుతారు అంటు చెప్పుకొచ్చింది.
Also read: ఆంధ్ర కింగ్ తాలూకా ఓటిటి డేట్ ఇదే
తమిళనాడు లోని వేలూరు కి చెందిన రాధికా ఆప్టే 2005 లో 'వాహ్ లైఫ్ హో తో అసి' అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హిందీలో సుమారు పదిహేను చిత్రాల వరకు చేసింది. దాదాపుగా బారతీయ అన్ని భాషల్లోను మెప్పించిన రాధిక వెబ్ సిరీస్ లోను తన సత్తా చాటుతుంది. ఈ ఏడాది జనవరిలో లాస్ట్ డేస్ అనే అమెరికన్ ఇంగ్లీష్ మూవీలో కనిపించగా, ఈ నెల 12 న సాలి మహబ్బత్ అనే వెబ్ సిరీస్ తో అడుగుపెట్టింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



