చరిత్ర సృష్టించిన 'పుష్ప-2'.. ఇప్పట్లో ఎవరూ టచ్ చేయలేరు!
on Dec 2, 2024
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప-1' మూవీ, 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'పుష్ప-2' వస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఎంతలా అంటే 'పుష్ప-1' వరల్డ్ వైడ్ గా రూ.145 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా, 'పుష్ప-2' ఏకంగా రూ.600 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. (Pushpa 2 The Rule)
నైజాంలో రూ.100 కోట్లు, ఆంధ్రాలో రూ.83 కోట్లు, సీడెడ్ లో రూ.30 కోట్లతో.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.213 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తమిళనాడులో రూ.52 కోట్లు, కర్ణాటకలో రూ.32 కోట్లు, కేరళలో రూ.20 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.200 కోట్లు, ఓవర్సీస్ లో రూ.100 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసిన పుష్ప-2.. వరల్డ్ వైడ్ గా రూ.617 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.617 కోట్లకు పైగా షేర్ లేదా రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. (Pushpa 2 Pre Release business)
ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే అత్యధిక థియేట్రికల్ బిజినెస్ కావడం విశేషం. 'బాహుబలి-2' తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' సైతం ఈ రేంజ్ బిజినెస్ చేయలేదు. 'ఆర్ఆర్ఆర్' వరల్డ్ వైడ్ గా రూ.450 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా.. రూ.600 కోట్లకు పైగా షేర్ (రూ.1300 కోట్లకు పైగా గ్రాస్) కలెక్ట్ చేసింది. అంటే, 'పుష్ప-2' కేవలం హిట్ గా స్టేటస్ దక్కించుకోవడానికే 'ఆర్ఆర్ఆర్' స్థాయి వసూళ్లు రాబట్టాల్సి ఉంది. బయ్యర్లకు ప్రాఫిట్స్ రావాలంటే అంతకుమించిన సంచలనాలు సృష్టించాల్సి ఉంది.
Also Read