తిరుపతిలో తలనీలాలు సమర్పించిన పవన్ వైఫ్ అన్నాలెజెనోవా..డిక్లరేషన్ ఇచ్చిందా!
on Apr 14, 2025
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిన్నకొడుకు మార్క్ శంకర్(Mark Shankar)ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయాల పాలవ్వడంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే.ఆ తర్వాత గాయాల నుంచి కోలుకోని ఇంటికి కూడా చేరుకున్నాడు.దీంతో పవన్ భార్య అన్నాలెజెనోవా(Anna Lezhneva)తన కొడుకు క్షేమంగా ఉండటానికి తిరుమల తిరుపతి(Tirupati)లో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami)కారణం అని నమ్మి,నిన్న ఆదివారం తిరుమల కొండపైకి చేరుకొని తన తలనీలాలని సమర్పించింది.
అనంతరం స్వామి వారిని దర్శనం చేసుకోగా,ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.క్రిస్టియన్ అయిన అన్నాలెజెనోవా ఏడుకొండలపైకి విదేశీయులు,ఇతర మతాలను ఆచరించేవారు వచ్చినప్పుడు తమకి వేంకటేశ్వరుడిపై నమ్మకం ఉందంటూ ఏ విధంగా అయితే డిక్లరేషన్ ఇస్తారో అన్నా లెజెనోవా కూడా అదే విధంగా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
