'పుష్ప 2'ని టార్గెట్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. పాపం అల్లు అర్జున్!
on Jun 29, 2024
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ (Allu Arjun) మద్దతు తెలపడం మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బన్నీ సినిమాలను బాయ్ కాట్ చేస్తామని అంటున్నారు. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుందనే వార్త సంచలనంగా మారింది.
ఆగస్టు 15న విడుదల కావాల్సిన అల్లు అర్జున్ 'పుష్ప-2' (Pushpa 2) మూవీ.. డిసెంబర్ 6 కి వాయిదా పడింది. అయితే డిసెంబర్ నెల 'పుష్ప 2' కి అంతలా కలిసొచ్చేలా కనిపించడం లేదు. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) చిత్రం డిసెంబర్ లోనే విడుదల కానుందని వార్తలొస్తుండగా.. ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా మూవీ 'హరి హర వీరమల్లు' (Hari Hara Veera Mallu) తెరపైకి వచ్చింది.
పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం మరియు ఇతర కమిట్ మెంట్స్ కారణంగా 'హరి హర వీరమల్లు' బాగా ఆలస్యమైంది. దాంతో దర్శకత్వ బాధ్యతల నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకోగా.. మిగతాని సినిమా పూర్తి చేసే బాధ్యతను నిర్మాత ఎ.ఎం.రత్నం కుమారుడు, దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడంతో పాటు, కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తుండటంతో.. ఇక ఇప్పట్లో 'హరి హర వీరమల్లు' రావడం కష్టమేనని భావించారంతా. కానీ ఇప్పుడు ఖచ్చితంగా డిసెంబర్ లోనే విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.
'హరి హర వీరమల్లు' డిజిటల్ రైట్స్ ని భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఆ సంస్థతో నిర్మాతలు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అక్టోబర్ లోనే సినిమాని విడుదల చేయాల్సి ఉందట. కానీ అప్పటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో.. మేకర్స్ రిక్వెస్ట్ చేసి, డిసెంబర్ లో విడుదల చేస్తామని చెప్పారట. ఒకవేళ డిసెంబర్ లో కూడా విడుదల కాకపోతే.. అమెజాన్ కి నిర్మాతలు భారీ మొత్తం పరిహారం చెల్లించాల్సి ఉంటుందట. అందుకే ఎలాగైనా డిసెంబర్ లోనే సినిమాని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం తన బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేయడానికి జులై లేదా ఆగస్టులో డేట్స్ ఇస్తానని చెప్పారట. ఈ లెక్కన డిసెంబర్ లో 'హరి హర వీరమల్లు' విడుదల కావడం దాదాపు ఖాయమనే చెబుతున్నారు. అదే జరిగితే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదు. ఒకే సమయంలో సినిమాలు వస్తే.. బన్నీని మెగా ఫ్యాన్స్ మరింత టార్గెట్ చేసే అవకాశముంది. అసలే 'పుష్ప-2'పై బన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు 'వీరమల్లు' పోటీగా వస్తే.. కలెక్షన్లకు గండి పడుతుంది. ముఖ్యంగా తెలుగునాట 'పుష్ప-2'కి భారీ నష్టం జరిగే అవకాశముంది. మరి దీని నుంచి పుష్పరాజ్ ఎలా బయటపడతాడో చూడాలి.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)