మహేష్-రాజమౌళి సినిమా నుంచి మరో లీక్.. డిప్యూటీ సీఎం పనే..!
on Mar 13, 2025
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. ఇటీవల షూటింగ్ లొకేషన్ నుంచి ఒక వీడియో క్లిప్ లీక్ అయింది. అది మహేష్ నటించిన కీలక సన్నివేశానికి సంబంధించిన క్లిప్ కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో లీక్ వచ్చింది. అది కూడా ఏకంగా ఒడిశా డిప్యూటీ సీఎం నుంచి కావడం విశేషం. (SSMB 29)
మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా, విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఇంతవరకు అఫీషియల్ గా ప్రకటించలేదు. మంచి అకేషన్ చూసి అనౌన్స్ చేయాలనేది మూవీ టీమ్ ఆలోచన. ఇంతలోనే ఒడిశా డిప్యూటీ సీఎం ప్రవతి పరిదా ఈ విషయాన్ని లీక్ చేసేశారు.
ఒడిశాలో 'SSMB 29' షూటింగ్ జరుగుతుండటంపై ఒడిశా డిప్యూటీ సీఎం సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. "గతంలో మల్కాన్‌గిరిలో 'పుష్ప-2' షూటింగ్ జరిగినట్లే.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తదుపరి చిత్రం 'SSMB 29' షూటింగ్ కోరాపుట్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో సౌత్ సూపర్‌స్టార్స్ మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. భవిష్యత్‌లో ఒడిశా.. సినిమా షూటింగ్‌లతో పాటు పర్యాటకరంగానికి గొప్ప గమ్యస్థానంగా మారుతుంది. ఒడిశాలో షూటింగ్స్ చేసేందుకు అన్ని భాషల ఇండస్ట్రీలను స్వాగతిస్తున్నాం." అని ఆమె రాసుకొచ్చారు.
ఒడిశా డిప్యూటీ సీఎం ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో రాజమౌళి అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండానే.. 'SSMB 29'లో పృథ్వీరాజ్, ప్రియాంక నటిస్తున్నారనే విషయాన్ని డిప్యూటీ సీఎం లీక్ చేశారంటూ నెటిజెన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
