నందమూరి కళ్యాణ్ రామ్ షూటింగ్ లో భారీ ప్రమాదం
on May 10, 2024
బింబి సార ,డెవిల్ లాంటి చిత్రాల విజయాలతో నందమూరి కళ్యాణ్ రామ్ మంచి జోష్ మీద ఉన్నాడు. తన తదుపరి చిత్రాన్ని కూడా ఎలాగైనా హిట్ చేసి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఒక పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ని చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ లో ఒక ఘోర ప్రమాదం జరిగింది
నారా రోహిత్ తో రాజా చెయ్యి వేస్తే చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రదీప్ చిలుకూరి దర్సకత్వంలో కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ సెట్లోనే ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీబీఐ ఆఫీస్ కి చెందిన ఒక భారీ సెట్ ని మేకర్స్ వేశారని తెలుస్తుంది. పది రోజుల పాటు షూటింగ్ కి ప్లాన్ చేసారు. ఇప్పటికే తొమ్మిది రోజుల పాటు షూటింగ్ జరిగింది.ఇక ఒక్క ఆరోజు మిగిలిందనగా ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చిత్ర యూనిట్ ప్రమాద విషయం తెలుసుకొని సెట్ కు వెళ్లేలోగా అంతా కాలి పోయింది. ప్రొడ్యూసర్ కి దాదాపు 4 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు
ఇక ఆ సెట్ లో చిత్రీకరించే సన్నివేశాలు సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశాలని తెలుస్తోంది. సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుంది. మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇక ప్రమాద వార్త తెలుసుకున్న నందమూరి అభిమానులు కళ్యాణ్ రామ్ కి గాని యూనిట్ కి గాని ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మొదటి నుంచి కూడా ఈ సినిమా విషయంలో మేకర్స్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు