ఏఎన్ఆర్ బయోపిక్ అవసరం లేదు..అడ్డుకుంటున్నఅదృశ్య శక్తి ఎవరు
on Nov 23, 2024
అక్కినేని నాగార్జున(nagarjna)ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55 వ'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'(iifa)ఈవెంట్ కి తన కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యాడు.అక్కడి రెడ్ కార్పెట్ పై సతీమణి అమల(amala)కొడుకునాగ చైతన్య(naga chaitanya)కాబోయే కోడలు శోభిత(sobitha)తో నడిచి అభిమానులకి కనువిందుని కూడా కలిగించాడు.ఇక ఈ వేదికపై ఏఎన్ ఆర్(anr)ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఒకటైన 'దేవదాసు' చిత్రాన్ని ప్రకటించడమే కాకుండా,సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ వర్క్స్ ఆఫ్ అక్కినేని పేరుతో ఒక ప్రోగ్రాం ని కూడా ఏర్పాటు చేసారు.
అందులో అక్కినేని బయోపిక్ గురించి చర్చకు వచ్చింది.అప్పుడు నాగార్జున మాట్లాడుతు నాన్న గారి బయోపిక్ గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది.కాకపోతే దాన్ని సినిమాగా కంటే డాక్యుమెంటరీగా తెరకెక్కిస్తేనే ఉపయోగం అనేది నా నమ్మకం.ఎందుకంటే అయన జీవితాన్ని సినిమాగా రూపొందించాలంటే చాలా కష్టం.ఆయన తన జీవితంలో ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యలేదు.ఎదుగుదల పెరుగుతూనే పోయింది.
అలాంటి సంఘటనలని తెరపై చూపించాలంటే బోర్ కొడుతుందేమో. సినిమా అనగానే ఒడిదొడుకులుని కూడా చూపించాల్సి ఉంటుంది.ఆ విధంగా చూపిస్తేనే సినిమా బాగుంటుంది.అందుకే ఆయన జీవిత కథలో కొన్ని కల్పితాలు జోడించి డాక్యుమెంటరీగా రూపొందించాలని చెప్పుకొచ్చాడు.మరి ఎప్పట్నుంచో అక్కినేని అభిమానుల్లో చాలా మంది అక్కినేని బయోపిక్ సినిమాగా రావాలని, ఏఎన్ఆర్ క్యారక్టర్ ని నాగార్జున చెయ్యడంతో పాటుగా,ఆ సినిమాలో అక్కినేని హీరోలందరూ నటించాలని కోరుకుంటున్నారు.ఈ నేపథ్యంలో నాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతని సంతరించుకున్నాయి.
Also Read