వాళ్ళకి ఇదే లాస్ట్ వార్నింగ్.. కేసులు బుక్ చేస్తాం: మైత్రి మూవీ మేకర్స్!
on Dec 7, 2024
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ‘పుష్ప2’ అంచనాలకు తగ్గట్టుగానే భారీ కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే. వరల్డ్‌వైడ్‌గా ఫస్ట్ డే రూ.294 కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసి ఇప్పట్లో ఏ ఇండియన్ మూవీ క్రాస్ చేయలేనంత ఎత్తులో ఉంది ‘పుష్ప2’. ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పటి నుంచే అల్లు అర్జున్‌పై ఒక వర్గం తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిందే. దానికి కారణాలు ఏవైనా ‘పుష్ప2’పై మొదటి నుంచీ నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. ఒక దశలో ఈ సినిమా రిలీజ్‌ని వారు అడ్డుకుంటారేమోనన్న సందేహం కూడా అందరికీ కలిగింది. అయితే ఎలాంటి అవాంతరం లేకుండా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న సినిమా విడుదలైంది. అంతకుముందు రోజు ప్రదర్శించిన ప్రీమియర్స్‌తోనే సినిమా రేంజ్ ఏమిటి అనేది అందరికీ అర్థమైంది. ట్రెండ్ చూస్తే డెఫినెట్‌గా సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని బన్నీ ఫ్యాన్స్ ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. మొదటి నుంచీ సినిమాకి నెగెటివ్ ప్రచారం చేస్తున్నప్పటికీ రిలీజ్ తర్వాత ఆ ప్రభావం సినిమాపై లేకపోవడంతో ప్లాన్ ‘బి’ని అమలులోకి తెచ్చారు యాంటీ ఫ్యాన్స్. సినిమాలోని కొన్ని డైలాగ్స్ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి పెట్టారని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ డైలాగ్స్‌తో మెగా హీరోలకు.. బన్ని ఓ రaలక్ ఇచ్చాడనే న్యూస్‌ను వైరల్ చేస్తున్నారు. సినిమాలో వాడిన డైలాగులను ప్రేక్షకుల్లో నెగెటివిటీ స్ప్రెడ్ అయ్యేలా మార్చేసి సినిమాలో ఉన్న డైలాగులు అవేనని నమ్మిస్తున్నారు. అంతేకాదు, సినిమాలో లేని డైలాగులను కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. దీంతో నిజంగానే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడని కామెంట్లు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఇలాంటి ప్రచారం వల్ల సినిమాకి భారీ నష్టం వాటిల్లుతుందని గ్రహించిన మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రంగంలోకి దిగారు. సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ‘సినిమాలో కథ ప్రకారం సహజంగా వచ్చే డైలాగులను వక్రీకరించి ప్రచారం చేయడమే కాకుండా, సినిమాలో లేని డైలాగులను సొంతంగా సృష్టించి అవి ‘పుష్ప2’ సినిమాలోనివేనని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మా సినిమాపై చేస్తున్న నెగెటివ్ ప్రచారాన్ని ఆపండి. అలాంటి పోస్టులు పెట్టడం ఆపకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని ట్వీట్ చేశారు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు.
Also Read