'డేవిడ్ రెడ్డి' గ్లింప్స్.. ఇది కదా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే..!
on Dec 17, 2025

భైరవం, మిరాయ్ సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మంచు మనోజ్.. 'డేవిడ్ రెడ్డి' ఫిల్మ్ తో పాన్ ఇండియా వైడ్ గా సౌండ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ గ్లింప్స్.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. (David Reddy)
మంచు మనోజ్ హీరోగా హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'డేవిడ్ రెడ్డి'. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు 1897-1922 మధ్య కాలంలో జరిగే కథగా ఇది తెరకెక్కుతోంది. ఇందులో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడే పవర్ ఫుల్ పాత్రలో మనోజ్ నటిస్తున్నాడు.
'డేవిడ్ రెడ్డి' షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా సినిమా ఎలా ఉండబోతుందో తెలుపుతూ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రెండున్నర నిమిషాల నిడివితో రూపొందిన ఈ గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. బ్రిటీషర్లతో పాటు ఇండియన్స్ కి కూడా డేవిడ్ రెడ్డి శత్రువే అన్నట్టుగా చూపించారు. 'ఇండియన్ డాగ్స్' అంటూ హేళన చేసే బ్రిటీషర్స్ పాలిట 'వార్ డాగ్' అయ్యాడు అంటూ అతని పాత్రని ఎస్టాబ్లిష్ చేశారు. వార్ డాగ్ పేరుతో తయారుచేసిన పవర్ ఫుల్ బైక్, చేతిలో బ్యాట్ తో మనోజ్ కనిపించిన తీరు అదిరిపోయింది. చూస్తుంటే ఈ సినిమాతో మనోజ్ గట్టిగానే సౌండ్ చేసేలా ఉన్నాడు.
Also Read: టాలీవుడ్ లో విషాదం.. నాగార్జున దర్శకుడు మృతి.. కారణమిదే!
కాగా, 'డేవిడ్ రెడ్డి' కోసం ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తుండగా.. డీఓపీగా వేణు ఆచార్య, ఎడిటర్ గా ఉజ్వల్ కులకర్ణి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



