తమ్ముడు మనోజ్ ని చూసి ఏడ్చిన మంచు లక్ష్మి!
on Apr 13, 2025
ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడానికి 'టీచ్ ఫర్ చేంజ్' అనే కార్యక్రమాన్ని నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఏడాది హైదరాబాద్ లో సెలబ్రిటీ ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. ఈ శనివారం జరిగిన ఈవెంట్ లో తన సోదరి లక్ష్మిని సర్ ప్రైజ్ చేస్తూ మంచు మనోజ్ (Manchu Manoj) పాల్గొన్నారు. మనోజ్ వెంట ఆయన సతీమణి మౌనిక కూడా ఉన్నారు. మనోజ్ ని చూసిన లక్ష్మి ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. తమ్ముడిని ప్రేమగా దగ్గరకు తీసుకొని కంటపడి పెట్టుకున్నారు. ప్రస్తుతం దీనిని సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అక్క-తమ్ముడు బాండింగ్ అంటే ఇది అంటూ నెటిజెన్లు పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా, కొంతకాలంగా మంచు కుటుంబంలో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. సోదరులు విష్ణు, మనోజ్ మధ్య వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో మోహన్ బాబు.. విష్ణు పక్షాన ఉన్నారు. మనోజ్ అంటే మొదటి నుంచి ఎంతో ప్రేమగా ఉండే లక్ష్మి.. సోదరుల మధ్య విభేదాలను పరిష్కరించలేక దూరంగా ఉండిపోయారు. ఇలాంటి సమయంలో మనోజ్ తన ఈవెంట్ దగ్గరకు వచ్చి సర్ ప్రైజ్ చేయడంతో.. తమ్ముడిని చూసి లక్ష్మి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
