చిక్కుల్లో శంకర వరప్రసాద్.. కోర్టు మెట్లు ఎక్కుతాడా?
on Jan 12, 2026

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నాయి. చిరంజీవి ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాని మలిచాడని చూసిన వారంతా చెబుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. ఒక విషయంలో మాత్రం ఈ సినిమా చిక్కుల్లో పడనుందా? అనే చర్చ జరుగుతోంది. (Mana Shankara Vara Prasad Garu)
'మన శంకర వరప్రసాద్ గారు'లో చిరంజీవి, నయనతార మధ్య లవ్ ట్రాక్ ని డిజైన్ చేసిన తీరు బాగుంది. మాటలతో కాకుండా కేవలం సైగలతోనే ఒకరికొకరు పరిచయమవుతారు. అలాగే వారు కలిసిన ప్రతిసారీ బ్యాక్ గ్రౌండ్ లో దళపతి సినిమాలోని 'సుందరి' సాంగ్ వినిపించడం భలే ఉంది. అయితే ఈ సాంగ్ ని స్వరపరిచింది మ్యాస్ట్రో ఇళయరాజా.
ఇటీవల కాలంలో తన అనుమతి లేకుండా ఎవరైనా తన ఓల్డ్ క్లాసిక్స్ సాంగ్స్ ని వేరే సినిమాల్లో ఉపయోగిస్తే.. ఇళయరాజా కోర్టుని ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇళయరాజా సాంగ్స్ రైట్స్ విషయంలో.. ఇప్పటికే పలు సినిమాలు చట్ట పరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొందరు ఆ పాటలను తొలగించాల్సి వస్తే, మరికొందరు ఏకంగా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న తమ సినిమాని తీసేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు 'మన శంకర వరప్రసాద్ గారు' విషయంలో ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
అందరిలా కేవలం 'దళపతి' నిర్మాతల దగ్గర అనుమతి తీసుకొని ఆ సాంగ్ ని ఉపయోగించి ఉంటే 'మన శంకర వరప్రసాద్ గారు' చిక్కుల్లో పడే అవకాశముంది. అలా కాకుండా ఇళయరాజా అనుమతి కూడా తీసుకొని ఉంటే.. ఏ ఇబ్బంది ఉండదు.
ఇటీవల కాలంలో తన సాంగ్స్ రైట్స్ విషయంలో ఇళయరాజా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుని ఆశ్రయిస్తున్న నేపథ్యంలో.. 'మన శంకర వరప్రసాద్ గారు' టీమ్ ముందుగానే అనుమతి తీసుకొని ఉంటుంది అనిపిస్తుంది. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం.. మెగాస్టార్ సినిమాకి కూడా ఇళయరాజా నుంచి షాక్ తప్పకపోవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



