అగ్ర నిర్మాత ఇంట్లో ఈడి సోదాలు..L 2 ఎంపురాన్ కి లింక్ ఉంది
on Apr 4, 2025
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohanlal)మరో సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj sukumaran) కాంబోలో మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ 'ఎల్ 2 ఎంపురాన్'(L2 Empuraan).మోహన్ లాల్ గత చిత్రం లూసిఫర్(Lucifer)కి పార్ట్ 2 గాలైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్,శ్రీ గోకులం మూవీస్ కలిసి సంయుక్తంగా మోహన్ లాల్ కెరిరీలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మించాయి.మూవీ అయితే ప్రేక్షాదరణతో దూసుకుపోతుంది.కాకపోతే సినిమాలోని కొన్ని సీన్స్ తో పాటు కొన్నిపేర్లు భారతీయ జనతా పార్టీ కి దగ్గరగా ఉన్నాయని కొంత మంది అభ్యంతరం వ్యక్తం చెయ్యగా,కొన్ని సీన్స్ ని డిలీట్ చెయ్యడంతో పాటు మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది.
రీసెంట్ గా ఎల్ 2 ఎంపురాన్ నిర్మాతల్లో ఒకరైన 'గోకులం గోపాలన్'(Gokulam Gopalan)ఇంట్లోతో పాటు చిట్ ఫండ్ కంపెనీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.దీంతో ఎంపురాన్ కి గోపాలన్ నిర్మాత కావటం వల్లనే ఈడీ సోదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 200 కోట్లు సాధించిన ఎల్ 2 ఎంపురాన్ లో మోహన్ లాల్ నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడ్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.మంజు వారియర్, అభిమన్యు సింగ్,టోవినో థామస్,జెరోమ్ ప్లాన్,ఇంద్రజిత్ సుకుమారన్,కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా దీపక్ దేవ్ సంగీతాన్ని అందించాడు.దర్శకుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్ర కూడా పోషించడం జరిగింది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
