ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు రూ.5 లక్షల చెక్ అందించిన ‘కల్కి’ నిర్మాత సి.అశ్వినీదత్!
on Jul 1, 2024
50 ఏళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి అగ్రనిర్మాతగా పేరు తెచ్చుకున్నారు సి.అశ్వినీదత్. తాజాగా భారతదేశం గర్వించే స్థాయిలో, ప్రపంచ సినీ పరిశ్రమని ఆకర్షించేవిధంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘కల్కి 2898ఎడి’ చిత్రం వరల్డ్‌వైడ్‌గా భారీ కలెక్షన్స్‌తో ముందుకు దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే నిర్మాత అశ్వినీదత్ తన మిత్రుడు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు నియోజక వర్గ అభివృద్ధి కోసం రూ.5 లక్షలు విరాళంగా అందించారు. ‘డ్రైనేజ్ మెయిటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉండి’ పేరుతో ఏర్పాటు చేసిన సహాయనిధికి అశ్వినీదత్ ఈ విరాళాన్ని అందించారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అభివృద్ధి కార్యక్రమానికి సహాయాన్ని అందించిన నిర్మాత సి.అశ్వినీదత్‌కు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
![]( https://www.teluguone.com/images/g-news-banner.gif)
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
![](https://www.teluguone.com/tmdb/images/read-1.jpg)