నితిన్ మూవీపై గుత్తాజ్వాల షాకింగ్ కామెంట్స్
on Mar 15, 2025
నితిన్(Nithiin)కెరీర్ లో వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మూవీ'గుండెజారి గల్లంతయ్యిందే'(Gunde jaari Gallanthayyinde)2013లో ప్రేక్షకుల ముందుకు రాగా నిత్య మీనన్,ఇషాతల్వార్ హీరోయిన్లుగా చేసారు.కొండా విజయ్ కుమార్(Konda Vijaykumar)దర్శకత్వంలో శ్రేష్ట్ మీడియాపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించడం జరిగింది.విక్రమ్ గౌడ్ సమర్పకుడిగా వ్యవహరించాడు.ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ 'గుత్తాజ్వాల'(Jwala Gutta)తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టి 'గుండెజారి గల్లంతయ్యిందే' లో ఒక స్పెషల్ సాంగ్ చేసి తన డాన్స్ తో,అందంతో ప్రేక్షకులలో గిలిగింతలు కూడా రేపింది.
రీసెంట్ గా గుత్తా జ్వాల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నితిన్ నాకు చాలా మంచి స్నేహితుడు.ఒక పార్టీలో కలిసినపుడు'గుండెజారి గల్లంతయ్యిందే' గురించి చెప్పి మూవీలో ఒక సాంగ్ ఉంది.నువ్వు చేయాలనీ అనగానే నేను సరే అన్నాను.ఆ తర్వాత కొన్ని రోజులకి వచ్చి చేయాలనే అనగానే నో అని చెప్పాను.కానీ నితిన్ ఒప్పుకోకుండా సాంగ్ ఫైనల్ అయ్యింది చేయమనే సరికి ఇక చేసేది లేక ఆ సాంగ్ లో చేశాను.ఆ మూవీ ఘన విజయం సాధించాక నీ వల్లే నా సినిమాకి నేషనల్ మీడియాలో ప్రమోషన్స్ జరుగుతుందని చెప్పాడు.నాలుగు రోజుల పాటు ఆ సాంగ్ ని షూటింగ్ చేసాం.ఇప్పుడు దాని గురించి మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉంది.
నితిన్ మూవీలో చేయక ముందే చాలా సార్లు సినిమా ఆఫర్స్ వచ్చాయి.కానీ బ్యాడ్మింటన్ లో బిజీగా ఉండటం వల్ల ఆఫర్స్ కి నో చేప్పాను.ఇండస్ట్రీలో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు.ఇందులో రాణించాలంటే సిగ్గు అనేది ఉండకూడదు.ఎన్నో విషయాల్లో సర్దుకుపోతు ఉండాలి.అలా చెయ్యడం నా వల్ల కాదని చెప్పుకొచ్చింది.గుత్తాజ్వాల 2021 లో ప్రముఖ తమిళ నటుడు,నిర్మాత విష్ణు విశాల్ ని వివాహం చేసుకుంది.ప్రపంచ పోటీల డబుల్స్‌లో కాంస్యం గెలుచుకున్న జ్వాల, కామన్వెల్త్ పోటీల్లో అదే విభాగంలో విజేతగా నిలిచింది.2010 వరకు పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ విజేతగా నిలవడమే కాకుండా 2011 లో కేంద్ర ప్రభుత్వం చేత అర్జున అవార్డు(Arjuna Award)ని కూడా అందుకుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
