ENGLISH | TELUGU  

గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ 

on Dec 20, 2025

 

 

 

సినిమా పేరు: గుర్రం పాపిరెడ్డి
తారాగణం: నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, బ్రహ్మానందం, యోగిబాబు, జీవన్, రాక్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తదితరులు  తదితరులు 
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్
మ్యూజిక్: కృష్ణ సౌరభ్ 
రచన, దర్శకత్వం: మురళీ మనోహర్
సినిమాటోగ్రాఫర్: అర్జున్ రాజా
బ్యానర్: బురా అండ్ సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ ఎల్ ఎల్ పి, ఎంజెఎం మోషన్ పిక్చర్స్  
నిర్మాతలు: వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్,
విడుదల తేదీ: డిసెంబర్ 20 ,2025 

 

 

మత్తు వదలరా మూవీతో నటుడుగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందిన నరేష్ అగస్త్య(Naresh Agastya)హీరోగా మారి ఈ ఏడాది ఇప్పటికే 'మేఘాలు చెప్పిన ప్రేమకథ' తో వచ్చాడు. ఇప్పుడు మరోసారి గుర్రం పాపిరెడ్డి(Gurram Paapireddy)అనే మూవీతో జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తో కలిసి థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ప్రచార చిత్రాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న   
గుర్రం పాపిరెడ్డి ఏ మేర ఆకట్టుకున్నాడో చూద్దాం.

 

 


కథ


గుర్రం పాపిరెడ్డి (న‌రేష్ ఆగ‌స్త్య) ఒక మధ్య తరగతి యువకుడు. కొంచం అమాయకత్వాన్ని 
కూడా కలగలసిన పాపిరెడ్డికి డబ్బు సంపాదించడమే లక్ష్యం. ఈ క్రమంలో ఒకసారి  బ్యాంకు రాబడికి ప్రయత్నించి విఫలమవుతాడు. సౌదామిని(ఫరియా అబ్దుల్లా)  హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుంది. సౌదామిని కి కూడా గుర్రం పాపిరెడ్డి లాగా డబ్బు సంపాదించడమే ధ్యేయం. ఈ ఇద్దరు శ్రీశైలం పరిసర ప్రాంతాల్లోని ఒక సమాధిలో ఉన్న శవాన్ని బయటకి తీసి వేరే ఏరియాలో ఉన్న సమాధిలోకి మార్చాలని నిర్ణయించుకుంటారు. అందుకు గొయ్యి (జీవ‌న్), మిల‌ట‌రీ (క‌సిరెడ్డి), చిలిపి (వంశీధ‌ర్ గౌడ్‌) అనే మరో ముగ్గురుకి డబ్బు ఆశ చూపించి తమతో కలుపుకుంటారు. మరో వైపు భారతదేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఉన్న కళింగ సంస్థాన రాజకుటుంబీకులు హైగ్రీవ (జాన్ విజయ్), నీలగ్రీవ (ప్రదీప్ రుద్ర) పాపిరెడ్డి కోసం వెతుకుతు ఉంటారు. రాజ కుటుంబీకులు పాపిరెడ్డి కోసం ఎందుకు వెతుకుతున్నారు? డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న పాపిరెడ్డి,  సౌదామిని శ్రీశైలం సమీప ప్రాంతంలో ఉన్న శవాన్ని తీసుకురావడానికి ఎందుకు పూనుకున్నారు? ఆ శవాన్ని ఎక్కడికి మార్చాలి? మార్చితే వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? ఆ ప్రయాణంలో వాళ్ళు సక్సెస్ అయ్యారా? ఆ శవం వెనక ఉన్న కథ ఏంటి? చివరిగా పాపిరెడ్డి,  సౌదామిని అండ్ బ్యాచ్  కథ ఎలా ముగిసింది? అనేదే పాపిరెడ్డి చిత్రకథ.

 

 


ఎనాలసిస్ 


సినిమా ప్రారంభం నుంచే ఎంటర్ టైన్ మెంట్ ప్రధాన లక్ష్యంగా డార్క్ కామెడీ తో  గుర్రం పాపిరెడ్డి  తెరకెక్కిందనే విషయం అర్ధమవుతుంది. పైగా శవాల మార్పిడి కాన్సెప్ట్ కూడా కొత్తదే. అందుకోసం పాపిరెడ్డి ముగ్గురు తెలివితక్కువ వాళ్ళ సాయం తీసుకోవ‌డం, దాని వెనుక `కోడి బుర్ర‌` రీజ‌నింగ్ చెప్ప‌డం బాగుంది. కానీ సినిమాలోకి వెళ్లే కొద్దీ సన్నివేశాల్లో పస లోపించింది. పైగా డార్క్ కామెడీలో  ఉండాల్సిన కామెడీ, థ్రిల్స్ కూడా మిస్సయ్యాయి. అదే పాపిరెడ్డి కి మైనస్ గా పరిగణించే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ లో చూసుకుంటే గోల్డ్ షాప్ దొంగ‌త‌నంతో మూవీ ప్రారంభమయ్యింది. మిగతా    
కథ మొత్తానికి రన్నింగ్ కావడానికి కావాల్సిన క్యారక్టర్ లన్నింటినీ గోల్డ్ షాప్ దగ్గరే   పరిచయం చేయడంతో పాటు డైరెక్ట్ గా కథలోకి వెళ్లడం బాగుంది.

 

 

దీంతో మనం పాపిరెడ్డి టీం తో ట్రావెల్ అవుతాం. ఈ క్రమంలో వచ్చే సీన్స్ లాజిక్ కి భిన్నంగా ఉన్నా నవ్వుని మాత్రం తెప్పిస్తాయి. ముఖ్యంగా శవాల దొంగ‌త‌నలా సీన్స్ చాలా స‌ర‌దాగా ఉంటాయి. ఆ ప్రాసెస్ లో క్యారెక్టర్స్ మధ్య ఎదురయ్యే గంద‌ర‌గోళం, మిల‌ట్రీని గోతిలో క‌ప్పేయ్య‌డం న‌వ్వులు పంచుతాయి. గొయ్యిని క‌ళింగ వార‌సుడిగా కోర్టు మెట్లు ఎక్కిండం, ఆ తరువాత  అస‌లు క్యారక్టర్ లు రంగ ప్ర‌వేశం చేయ‌డంతో క‌థ‌నంలో పట్టు  వ‌స్తుంది. ఇంట్ర‌వెల్ ట్విస్ట్ కూడా బాగుండటంతో  పాటుసెకాంఫ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ కలిగించింది. కాకపోతే సెకండ్ హాఫ్ ఆశించినంతగా లేదు. దాదాపుగా కోర్టు డ్రామా చుట్టూనే కథ తిరగడంతో పాటు గొయ్యిని క‌ళింగ వార‌సుడిగా నిరూపించ‌డం చుట్టూనే తిరుగుతుంది.

 

 

దీంతో ఫస్ట్ హాఫ్ లో ఉన్న మజా సెకండ్ హాఫ్ లో రాలేదు, కోర్టులో వాదోపవాదనలు అయితే  మ‌రీ సిల్లీగా అనిపిస్తాయి. డీఎన్ఏ టెస్ట్ కోసం జ‌రిగిన ప్ర‌హ‌స‌నం అయితే ఎక్కువ లెంత్ లో ఉంది.  కళింగ సంస్థానానికి చెందిన సీన్స్ తో పాటు పురాణాల్ని కూడా ఆధునిక కథకి లింక్ చేసే సందర్భంగా వచ్చే సీన్స్ లాజిక్ లేని విధంగా ఉన్నాయి.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.

 

 


నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు

 

 

ఒక్కరిని కాదు మూవీలో చేసిన నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా, జీవన్, రాక్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ గౌడ్, జాన్ విజయ్ తమ క్యారక్టర్ ల పరిధి మేరకు అత్యద్భుతమైన ప్రదర్శన కనపర్చారు. ఇక బ్రహ్మానందం, యోగిబాబు పెర్ఫార్మ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. తమ నటనతో మరోసారి మెప్పించారు. దర్శకుడిగా, రచయితగా మురళి(MUrali Manohar)పెద్దగా మెప్పించలేక పోయాడు. డార్క్ కామెడికి కావాల్సిన పర్ఫెక్ట్ సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ఆలోచించలేకపోయాడు. కృష్ణ సౌరభ్  నేపధ్య సంగీతం బాగుంది. అర్జున్ రాజా  ఫోటో గ్రఫీ కూడా పర్లేదు. నిర్మాణ విలువ‌లు నామ మాత్రమే.

 

 

ఫైనల్ గా చెప్పాలంటే కంటెంట్ చాలా కొత్తది. అందుకు తగ్గట్టుగా ఎగ్జాయిట్మెంట్ ని  తెప్పించే సన్నివేశాలు రాసుకోవడంలో మేకర్స్ విఫలమయ్యారు. ఫస్ట్ హాఫ్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్ నామమాత్రంగా ఉంది.

 


   

 rating 2.75/5

                                                                                                                   అరుణాచలం         

                                                                                                                                     

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.