రామ్ చరణ్ ఫ్యాన్స్ కి బుచ్చిబాబు బిగ్ షాక్!
on Mar 23, 2025
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన 16వ సినిమాని బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి 'RC 16' అనేది వర్కింగ్ టైటిల్. రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చి 27న 'RC 16' గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలొచ్చాయి. దీంతో మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే వారికో షాకింగ్ న్యూస్. మార్చి 27న గ్లింప్స్ విడుదల ఉండకపోవచ్చని తెలుస్తోంది.
గ్లింప్స్ విడుదల కావట్లేదని ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వక్కర్లేదని, ఎందుకంటే ఆ స్థానంలో ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 'RC 16'లో రామ్ చరణ్ పాత్రని దర్శకుడు బుచ్చిబాబు పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడని, 'రంగస్థలం'లో చిట్టిబాబు పాత్రకు ఎంత పేరు వచ్చిందో, అంత పేరు వస్తుందని చెబుతున్నారు. లుక్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనో బుచ్చిబాబు అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
రామ్ చరణ్ లుక్ తో పాటు, మూవీ టైటిల్ ని కూడా.. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే రివీల్ చేయనున్నారట. ఈ సినిమాకి 'పెద్ది' అనే టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది. అయితే చరణ్ మాత్రం మరో కొత్త టైటిల్ చూడమని చెప్పినట్లు ఈ మధ్య వార్తలొచ్చాయి. మరి ఈ సినిమాకి 'పెద్ది' టైటిల్ నే లాక్ చేశారో, లేక వేరే ఏదైనా కొత్త టైటిల్ వైపు మొగ్గుచూపారో అనేది మార్చి 27న తేలిపోనుంది.
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
