రాజ్యసభకి చిరంజీవి ఎంపిక ఖరారు!
on Dec 12, 2024
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.నాలుగు దశాబ్దాల నుంచి సినిమా రంగంలో రాణిస్తూ కొన్ని లక్షల మంది అభిమానులు గుండెల్లో చిర స్థాయిగా కొలువు తీరి ఉన్నాడు.అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి కూడా వచ్చిన చిరు ప్రజారాజ్యం అనే పొలిటికల్ పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. అందులో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీ లో విలీనం చేసి రాజ్య సభ ఎంపీగా పని చెయ్యడమే కాకుండామన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.కానీ తన పదవి కాలం ముగిసిన దగ్గరనుంచి రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నాడు
కానీ ఇప్పుడు చిరంజీవిని రాజ్య సభకి పంపించే యోచనలో మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.రాష్ట్రపతి కోటాలో జులై 14 న ఖాళీ అయిన నాలుగు రాజ్య సభ స్థానాలని జనవరి 14 లోపు భర్తీ చెయ్యాల్సిఉంది.ఇప్పుడు ఇందులోని ఒక స్థానానికి చిరంజీవి పేరుని కేంద్రం పరిశీలిస్తుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan)బిజెపీతో పొత్తులో ఉండటమే కాకుండా ఆ పార్టీ గెలుపుకోసం వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకి కూడా ప్రచారం చేస్తూ ఉండటంతో పవన్ సేవలకి కృతజ్ఞతగా చిరుకి అవకాశం ఇవ్వాలనేది బిజెపీ భావన.మరి చిరు రాజ్యసభ కి సముఖత వ్యక్తం చేస్తాడో లేదో చూడాలి.
చిరు ప్రస్తుతం విశ్వంభర మూవీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. చిరు సోదరుడు నాగబాబు(nagababu)కూడా ఏపీ గవర్మెంట్ లో త్వరలోనే మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విషయం తెలిసిందే.
Also Read