Mana Shankara Vara Prasad Garu: 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ చూస్తూ అభిమాని మృతి!
on Jan 12, 2026

మెగా అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu) మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ మెగా అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఈ ఆనందకర సమయంలో ఓ విషాదం చోటుచేసుకుంది. సినిమా చూస్తూ మెగా అభిమాని కన్నుమూశాడు.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని అర్జున్ థియేటర్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా చూస్తున్న సమయంలో ఓ అభిమాని అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. సంతోషంగా సినిమా చూడటానికి వచ్చిన తోటి అభిమాని ఇలా అకస్మాత్తుగా మరణించడంతో మెగా అభిమానుల్లో విషాదం నెలకొంది.
Also Read: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



