ENGLISH | TELUGU  

ఇది కదా ఫ్యామిలీ బాండింగ్ అంటే.. పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి, రామ్ చరణ్!

on May 7, 2024

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగింది. ఇప్పటికే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ పిఠాపురంలో పవన్ తరపున ప్రచారం చేశారు. తాజాగా పవన్ కి మద్దతుగా చిరంజీవి (Chiranjeevi) ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) కూడా సోషల్ మీడియా వేదికగా తన మద్దతు తెలిపాడు.

"తన గురించి కంటే, జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలి అనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనను ఎందరికో సాయం చేశాడు. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వల్లే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మి, జనం కోసం జనసైనికుడు అయ్యాడు. చట్టసభల్లో కళ్యాణ్ లాంటి నాయకుడి గొంతు మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి." అంటూ చిరంజీవి ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. 

పవన్ కి మద్దతుగా చిరంజీవి మాట్లాడిన వీడియోని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన రామ్ చరణ్.. "మీ భవిష్యత్తు  కోసం  పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి." అని రాసుకొచ్చాడు. 

పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం రంగంలోకి దిగడం చూసి అభిమానులు సంబరపడుతున్నారు. ఫ్యామిలీ బాండింగ్ అంటే ఇలా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.