ఒంటిపై పెట్రోల్ పోసుకొని చనిపోవడానికి సిద్ధపడిన అల్లు అర్జున్ అభిమాని
on Dec 14, 2024
సంధ్య థియేటర్ లో జరిగిన మహిళ మృతి కేసులో అల్లు అర్జున్(allu arjun)నిన్న అరెస్ట్ కావడం,ఆ తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా నిన్న నైట్ చంచల్ గూడ జైలులోనే ఉండగా,ఇక ఈ రోజు ఉదయం విడుదల అయ్యాడనే విషయం తెలిసిందే. ఇక ఈ విషయం మీద అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గరనుంచి ఆయన అభిమానులు ప్రతి క్షణం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ వస్తున్నారు.
దీంతో ఒక అభిమాని అల్లు అర్జున్ సార్ ని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. సార్ ని విడుదల చెయ్యాలంటూ ఈ రోజు తెల్లవారు జామున చంచల్ గూడ జైలు వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పటించుకోవడానికి ప్రయత్నం చేసాడు. దీంతో వెంటనే పోలీసులు వచ్చి అతని ఒంటిపై నీళ్లు చల్లి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు
ఇక ఈ కేసులో అల్లు అర్జున్ తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్ట్ బెయిల్ ఉత్తర్వుల్లో తక్షణం విడుదల చేయాలి అని స్పష్టంగా ఉన్నా కూడా జైలు అధికారులు ఆ రూల్స్ ని పాటించ కుండా అల్లు అర్జున్ ని అక్రమంగా నిర్బందించారు.అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని అయన చెప్పడం జరిగింది.
Also Read