అల్లు అర్జున్ కి సపోర్ట్ గా రేవంత్ రెడ్డి..ఇది జరిగిన తర్వాతే
on Dec 23, 2024
పుష్ప2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం,ఆ కేసులో అల్లుఅర్జున్(allu arjun)అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకి రావడం,అసెంబ్లీ వేదికగా చాంద్రాయణ గుట్ట ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నాసమయంలో సంధ్య థియేటర్ అంశాన్ని లేవనెత్తడం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు బదులిస్తు అల్లు అర్జున్ ని ఉద్దేశించి మాట్లాడగా అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి(revanth reddy)మాట్లాడిన మాటలకి వివరణ కూడా ఇవ్వడం జరిగింది.
ఇక ఆ తర్వాత కొంత మంది వ్యక్తులు జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద ధర్నా చేస్తూ రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలని నినాదాలు చేస్తూ రాళ్లు కూడా విసరడం జరిగింది.ఇప్పుడు ఈ విషయంపై రేవంత్ రెడ్డి స్పందిస్తు సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నాను.శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ,నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను.ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్నిసహించేది లేదు. అదే విధంగా సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది, సంధ్య థియేటర్ ఇష్యుపై స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది.
అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చెయ్యగా కోర్టు వాళ్ళకి అరెస్ట్ అయిన కాసేపటికే బెయిల్ మంజూరు చేసింది.తన ఇంటి మీద జరిగిన దాడి విషయంలో అభిమానులు సంయనం పాటించాలని అల్లుఅర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియచేసాడు.