అల్లు అర్జున్ ని కావాలనే జైలులో ఉంచారంటున్న అశోక్ రెడ్డి
on Dec 13, 2024
అల్లు అర్జున్(allu arjun)కి నిన్న హైకోర్టు బెయిల్ ఇచ్చినా కూడా అల్లు అర్జున్ నిన్న చంచల్ గూడ జైలులోనే ఉండవలసి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం ఉత్తర్వులు తర్వాత జరగాల్సిన మిగతా ప్రొసిడింగ్ పనులు పూర్తి కాకపోవడం వలనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ జైలు నుంచి విడుదల అయ్యారు.
ఇక ఈ విషయం మీద అల్లు అర్జున్ తరుపు న్యాయవాది అశోక్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్ట్ బెయిల్ ఉత్తర్వుల్లో తక్షణం విడుదల చేయాలి అని స్పష్టంగా ఉన్నా కూడా జైలు అధికారులు ఆ రూల్స్ ని పాటించ కుండా అల్లు అర్జున్ ని అక్రమంగా నిర్బందించారు.అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి, ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని అయన చెప్పడం జరిగింది.
Also Read